ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీటి సంరక్షణపై.. జలశక్తి అభియాన్​తో అవగాహన - andhrapradesh

రాష్ట్ర వ్యాప్తంగా జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులకు.. జల సంరక్షణపై అవగాహన కల్పించారు.

jalashakthi abhiyan

By

Published : Sep 4, 2019, 3:37 AM IST

జలశక్తి అభియాన్

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరు సమీపంలోని ఎన్ఎస్ వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన జల శక్తి అభియాన్ మేళా కార్యక్రమానికి మంత్రి ఆదిమూలపు సురేష్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. వెలిగొండ ప్రాజెక్టు వచ్చే ఏడాది జూన్ నాటికి మొదటి టన్నెల్ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో...

పెదవేగి మండలం లక్ష్మీపురంలోని ఆయిల్​ పామ్ పరిశోధన కేంద్రంలో కిసాన్ మేళ జల శక్తి అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి హాజరయ్యారు. పెదవేగి జంగారెడ్డిగూడెం మండలం లో భూగర్భ జలాలు అడుగంటి పోవడంపై ఆవేదన చెందారు.

కృష్ణా జిల్లాలో...

ముసునూరు మండలం గోగులంపాడు గ్రామం లో జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా కిసాన్ మేళా నిర్వహించారు. నూజివీడు శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు హాజరయ్యారు. రైతులంతా రసాయన రహిత సేంద్రియ వ్యవసాయం చేయాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details