పాదయాత్రలో ప్రజల బాధలు చూశా... కన్నీటి గాథలు విన్నా...సాయం కోసం ఎదురుచూస్తున్న ప్రతి ఒక్కరి కోసం నేను వస్తా - జగన్
'తెదేపాది దోపిడీ ప్రభుత్వం'
ఐదేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రం దోపీడీకి గురైందని జగన్ ధ్వజమెత్తారు. తెదేపా పాలనలో మోసపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటానని హామీ ఇచ్చారు. చంద్రబాబు హయాంలో ప్రతి పనికీ లంచం తీసుకున్నారని ఆరోపించారు. ప్రజలు బాధలను పాదయాత్రలో స్వయంగా చూశానని అన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం బహిరంగ సభలో జగన్
పొదుపు సంఘాల్లో ఉండే మహిళలో కష్టాల్లో ఉన్నారని జగన్విచారం వ్యక్తం చేశారు. చంద్రబాబు రుణాలు మాఫీ చేయకుండా... శాలువా కప్పించుకున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు 10 వేలు ఇచ్చినా... చెక్కులు 6 వేలు దాటలేదన్నారు. వైకాపా ప్రభుత్వం రాగనే ప్రతి డ్వాక్రా మహిళను ఆదుకుంటానని హామీ ఇచ్చారు జగన్