గోదావరి నది నుంచి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో డెల్టా కాలువకు జలవనరుల శాఖ సాగునీరు విడుదల చేసింది. ఎస్ఈ సూర్యప్రకాశ రావు, ఈఈలు మోహన్ రావు, దక్షిణా మూర్తి నిడదవోలు మండలం విజ్జేశ్వరం వద్ద సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి నీరు విడుదల చేశారు. వేద పండితులు పూర్ణకుంభంతో గోదారమ్మకు స్వాగతం పలికారు.
గోదావరి నుంచి డెల్టా కాలువకు నీటి విడుదల
గోదావరి నది నుంచి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో డెల్టా కాలువలకు సాగునీరు విడుదల చేశారు. నిడదవోలు మండలం విజ్జేశ్వరం వద్ద నుంచి ప్రధాన కాలువకు నీరు వదిలారు.
Irrigation water to west godavari
ప్రస్తుతం రోజుకు 500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నామని ఎస్ఈ సూర్యప్రకాశ రావు తెలిపారు. రైతుల అవసరాలు దృష్టిలో ఉంచుకుని నీటి విడుదల స్థాయిని పెంచుతామని వివరించారు. పంట ప్రారంభ దశకు ముందుగానే సాగునీరు విడుదల చేయడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.