'వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పూర్తి చేస్తాం. కనీసం ఏడాది పాటు పనిచేయాల్సి ఉంటుంది. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం హడావిడిగా చేయకూడదు. అప్రోచ్ ఛానల్ పనులు 76 శాతం పూర్తి చేశాం. ఏప్రిల్ నెలాఖరుకు మిగిలిన అప్రోచ్ ఛానల్ పనులు పూర్తి చేస్తాం. స్పిల్ వే పనులు ఫిబ్రవరి ఆఖరికి పూర్తి చేస్తాం. గేట్లను సంక్రాంతి తర్వాత బిగిస్తాం. రెండు నెలల పాటు గేట్ల బిగింపు ప్రక్రియ ఉంటుంది. లైనింగ్ పూర్తి చేస్తే కుడి కాలువ నుంచి నీళ్లు ఇవ్వొచ్చు. ప్రభుత్వం అనుమతి ఇస్తే జూన్ తర్వాత గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వొచ్చు. చేసిన పనులకు కేంద్ర నుంచి నిధులు రావడంలో జాప్యం జరుగుతోంది. నిధులు త్వరగా వస్తే పనులు త్వరగా ముందుకెళ్తాయి.'- పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ సుధాకర్
Polavaram project: 'వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పూర్తి చేస్తాం' - ap news
వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్టులో ప్రధాన నిర్మాణమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పూర్తి అవుతుందని .. ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ సుధాకర్ వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత ఈ పనులు మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. మొత్తం కోటి 16 లక్షల మెట్రిక్ టన్నుల రాయి మట్టితో ఈసీఆర్ ఎఫ్ డ్యామ్ నిర్మించనున్నట్టు .. ఆయన ఈటీవీ భారత్ ముఖాముఖిలో వివరించారు.
Polavaram project