పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రులో 2019 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 వరకు జరిగిన... జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీలు నిర్వహించారు. ప్రజావేదిక అనే కార్యక్రమం ద్వారా మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సదస్సులో వీటిని పరిశీలించారు. ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డ్వామా పీడీ రాంబాబు అన్నారు. గ్రామాల వారిగా , జిల్లా రిసోర్స్ పర్సన్ల పరిశీలనలో వచ్చిన సాంకేతిక సమస్యలపై ... క్షేత్ర సహాయకుల వివరణ తీసుకున్నారు. సాంకేతికంగా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల పై సామాజిక తనిఖీ ప్రజావేదిక
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరిగిన పనులకు... సంబంధించిన వివరాలను డ్వామా అధికారులు పరిశీలించారు. 2019 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 వరకు జరిగిన 3 కోట్ల రూపాయల ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీలు నిర్వహించారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల పై సామాజిక తనిఖీ
Last Updated : Dec 1, 2020, 12:57 AM IST