ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మత్స్యకారుల జీవనోపాధి వృద్ధికే ఫిషింగ్ హార్బర్' - నరసాపురం హార్బర్​ స్థలాన్ని పరిశీలించిన పరిశ్రమల శాఖ కార్యదర్శి

మత్స్యకారుల జీవనోపాధిని పెంచడానికి పశ్చిమ గోదావరిలో ఫిషింగ్ హార్బర్ నిర్మించడానికి ప్రభుత్వం పూనుకొంది. నరసాపురంలో ఆక్వా విశ్వవిద్యాలయ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించడానికి.. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వచ్చారు. హార్బర్ ద్వారా ప్రయోజనాలను వివరించారు. జీవనోపాధిని పెంచడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

industries secretary visit harbor land
హార్బర్ భూమిని పరిశీలిస్తున్న పరిశ్రమల కార్యదర్శి

By

Published : Oct 21, 2020, 11:11 AM IST

స్థానిక మత్స్య ఉత్పత్తులకు అధిక ఆదాయం సమకూర్చేందుకు ఫిషింగ్ హార్బర్ దోహదపడుతుందని పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వల్లవణ్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని బియ్యపు తిప్ప, చినమైనవాని లంక ప్రాంతాల్లో ఆక్వా విశ్వవిద్యాలయ ఏర్పాటుకు ఆయన స్థలాన్ని పరిశీలించారు. ఏపీ మారీటైం ఇండస్ట్రియల్ డెవలప్​మెంట్ కార్పొరేషన్, ఏపీ ఇండస్ట్రీస్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హార్బర్ నిర్మించనున్నట్లు తెలిపారు.

ఈ ప్రాంతంలో వంతెన, అనుబంధ రోడ్డు నిర్మాణాల ద్వారా.. ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు అవకాశం ఉంటుందని వల్లవణ్ అభిప్రాయపడ్డారు. మత్స్యకారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని హార్బర్ నిర్మించనున్నట్లు వెల్లడించారు. వారి జీవనోపాధిని పెంచడానికి ఉపయోగపడుతుందని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details