ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

న్యాయవాది అంటే ఇలా ఉండాలి : హైకోర్టు జడ్జి శేషసాయి - High Court judge av sesha sai at tanuku

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో.. నాలుగో అదనపు జిల్లా జడ్జి కోర్టు భవన(fourth additional district judge court building in Tanuku) ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా.. హైకోర్టు న్యాయమూర్తి ఏవీ శేషసాయి మాట్లాడుతూ.. న్యాయవాది అంటే ఎలా ఉండాలో చెప్పారు.

High Court judge av shesasai
హైకోర్టు న్యాయమూర్తి ఏవీ శేషసాయి

By

Published : Oct 31, 2021, 5:14 PM IST

ఒక న్యాయవాది... సహనంలో మహాత్మా గాంధీలా, జ్ఞానంలో బీఆర్ అంబేడ్కర్​ వలే, ధైర్య సాహసాలల్లో అల్లూరి సీతారామరాజు, ప్రకాశం పంతులు మాదిరిగా ఉండాలని హైకోర్టు న్యాయమూర్తి ఏవీ శేషసాయి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నాలుగో అదనపు జిల్లా జడ్జి కోర్టు భవన ప్రారంభోత్సవ కార్యక్రమం(fourth additional district judge court building in Tanuku)లో ఆయన పాల్గొన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు సోమయాజులు, జయసూర్య, తదితరులతో కలిసి జ్యోతిప్రజ్వలన చేశారు. అనంతరం నిర్వహించిన సదస్సు(court building inaugurate in Tanuku)లో ఆయన మాట్లాడారు.

ఈ వృత్తిలో ఇబ్బందుల్ని ఎవరికీ చెప్పుకోబోమని.. చెప్పుకో కూడదు
జూనియర్ న్యాయవాదులను కూడా ఆదరించాల్సిన అవసరం ఉందని ఏవీ శేషసాయి(High Court judge av sesha sai) పేర్కొన్నారు. వృత్తి ప్రారంభ దశలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటామో అందరికీ తెలిసిందేనన్నారు. వైట్ కాలర్ వృత్తి కావడంతో ఇబ్బందులను ఎవరికీ చెప్పుకోబోమని.. చెప్పుకో కూడదని అన్నారు. కరోనా కష్టకాలంలో ఎందరో ఔదార్యం చూపి ఆదుకున్నారని అభినందించారు. న్యాయవాదులు, న్యాయమూర్తులు పరస్పర అవగాహన ఉంటే కోర్టు ఆవరణ ప్రశాంతంగా ఉంటుందన్నారు.

న్యాయవాదులు.. సందర్భానుసారం నిశ్శబ్దంగా ఉంటే ఎన్నో మంచి ఫలితాలు వస్తాయని ఏపీ శేషసాయి పేర్కొన్నారు. ఈ సదస్సు(judge av sesha sai inaugurate court building in Tanuku)లో హైకోర్టు న్యాయమూర్తులు సోమయాజులు, జయసూర్య పాల్గొన్నారు.

ఇదీ చదవండి..

AP CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 385 కరోనా కేసులు.. 4 మరణాలు నమోదు

ABOUT THE AUTHOR

...view details