ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CORONA ATTACK: కరోనా వచ్చిందని​...ఏం చేశాడంటే..! - ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం రాచురులో కరోనా సోకిందని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానిక మంచినీటి చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడగా స్థానికులు గుర్తించి రక్షించారు.

SUICIDE ATTEMPT
కరోనా సోకిందని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

By

Published : Oct 6, 2021, 8:48 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం రాచూరు గ్రామానికి చెందిన ఓలేటి మహంకాళి రెడ్డి, ఏసమ్మ దంపతులు. వారు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ నెల 5న కొవిడ్ పరీక్ష చేయించుకున్నారు. గురువారం వచ్చిన ఫలితాల్లో ఇద్దరికీ కరోనా పాజిటివ్ అని నిర్ధరణ అయ్యింది.

మహమ్మారి సోకిందన్న భయంతో మహంకాళి రెడ్డి గ్రామంలోని మంచినీటి చెరువులోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతన్ని గమనించిన వాలంటీరు గొల్లుదేవి రవితేజతో పాటు మరో ఇద్దరు యువకులు పోసిబాబు, లోకేశ్ చెరువులోకి దూకి మహంకాళి రెడ్డిని రక్షించారు. చికిత్స నిమిత్తం భార్యాభర్తలిద్దరినీ ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details