రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉండడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విమర్శించారు. నియోజకర్గంలో నిర్వహించిన ప్రజాచైతన్య యాత్రలో పాల్గొన్న ఆయన ప్రజాసమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైకాపా అధికారంలోకి రాగానే డ్వాక్రా మహిళలకు పూర్తిగా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఆ మాట మర్చిపోయారని ఆక్షేపించారు. మూడు రాజధానులపై ముఖ్యమంత్రి జగన్‌కే స్పష్టత లేదని ఎద్దేవా చేశారు.
'వైకాపా పాలనలో ప్రజలకు ఇబ్బందులు తప్పటం లేదు' - జగన్ పై చింతమనేని విమర్శలు
వైకాపా పాలనలో ప్రజలు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెదేపా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విమర్శించారు. అధికారంలోకి రాగానే డ్వాక్రా మహిళలకు పూర్తి రూణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని ఆక్షేపించారు.
వైకాపా పాలనలో ప్రజలకు ఇబ్బందులు తప్పటం లేదు