పశ్చిమ గోదావరి జిల్లాలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు మూలా నక్షత్రం సందర్భంగా ఉండ్రాజవరం ముత్యాలమ్మ వారి ఆలయంలో... అమ్మవారు సరస్వతీ దేవిగా దర్శనమిచ్చారు. అమ్మవారిని అనుగ్రహభాషిణి గా తీర్చిదిద్ది అభిషేకించారు. అనంతరం విద్యార్థిని, విద్యార్థులు సామూహిక పూజలు చేశారు.
మూలా నక్షత్రం నాడు అమ్మవారి పుట్టిన రోజు కావడంతో ఆరోజు అమ్మవారికి సరస్వతీ పూజ చేయడం ఆనవాయితీ. జ్ఞానానికి అధిష్ఠాన దేవత అయిన చదువుల తల్లి, సరస్వతికి ప్రత్యేక పూజలు చేశారు. పలువురు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తుల దర్శనానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.