ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేకాటలో వివాదం.. కోడి పందేల్లో యువకుల ఘర్షణ - పశ్చిమ గోదావరి న్యూస్

పశ్చిమ గోదావరి జిల్లాలో కొయ్యలగూడెంలో జరుగుతున్న కోడి పందాల్లో కొంతమంది యువకులు ఘర్షణలకు దిగారు. పేకాటలో తలెత్తిన వివాదం కారణంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.

In the ring of kodi races in West Godavari district .. Conflicts between youths
ఒక వైపు కోడి పందాలు.. మరో వైపు యువకుల మధ్య ఘర్షణలు..

By

Published : Jan 14, 2021, 7:47 PM IST

ఒక వైపు కోడి పందాలు.. మరో వైపు యువకుల మధ్య ఘర్షణలు..

పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం.. దిబ్బకాయల గూడెం గ్రామంలో కోడి పందేలు.. ఉద్రిక్తతకు దారి తీశాయి. కొందరు యువకులు.. పరస్పరం తీవ్ర దాడి చేసుకున్నారు. పేకాటలో తలెత్తిన వివాదమే ఘర్షణకు కారణమైంది. చాలా సేపు గొడవ జరుగుతున్నా.. పోలీసులు ఏ మాత్రం స్పందించలేదంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి.. కోడి పందేల నిర్వాహకులే.. యువకులకు సర్ది చెప్పి అక్కడినుంచి పంపించేశారు.

ABOUT THE AUTHOR

...view details