ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు దుర్మరణం - పూళ్లలో రోడ్డు ప్రమాదం

వారు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాబోయే రోజుల్ని తలచుకుంటూ మురిసిపోయారు. కానీ.. కాళ్ల పారాణి ఆరకముందే రోడ్డు ప్రమాదం వారిని కబళించింది. నూతన దంపతులతో పాటు వధువు సోదరుడు దుర్మరణం పాలయ్యాడు.

In a road accident three men death in poolla west godavari district
పూళ్లలో రోడు ప్రమాదం.. నవ దంపతులు సహా మరొకరి దుర్మరణం

By

Published : Jun 18, 2020, 7:17 PM IST

Updated : Jun 19, 2020, 7:03 AM IST

గుమ్మాలకు తోరణాలు ఇంకా తొలగలేదు. పెళ్లి ముచ్చట్లు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. అనుకోని ప్రమాదం ఆ నవ దంపతులను మృత్యులోకాలకు తీసుకెళ్లింది. పూళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖ జిల్లా సబ్బవరానికి చెందిన వరుడు వెంకటేష్, గుంటూరు జిల్లా గోవాడకు చెందిన వధువు మానస నవ్య, కారు డ్రైవర్‌ చంద్రశేఖర్‌ అసువులు బాశారు. ఈనెల 14న వివాహం జరిగింది. వెంకటేష్‌ తండ్రి చనిపోవడంతో తల్లే కొడుకును చదివించి ప్రయోజకుడిని చేసింది. అతను విశాఖలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. నూతన జంట ఈనెల 15న సబ్బవరం వెళ్లారు. 16న సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. 17న గుంటూరు జిల్లాకు వెళ్లారు. అక్కడ నుంచి 18న తిరిగి సబ్బవరం వెళ్తుండగా ప్రమాదం జరిగింది.


గోవాడ గ్రామానికి చెందిన ఆలపాటి వెంకటేశ్వరరావు, మణి దంపతుల రెండో సంతానమైన మానస నవ్యను తల్లిదండ్రులు బీటెక్‌ వరకు చదివించారు. కొంతకాలం ఈమె బెంగళూరులో ఉద్యోగం చేసి ఇటీవలే ఇంటికి వచ్చారు. పెళ్లి జరగడం, ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. గోవాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Last Updated : Jun 19, 2020, 7:03 AM IST

ABOUT THE AUTHOR

...view details