నివర్ తుఫాన్ ప్రభావం వరి పంట నష్టం పశ్చిమగోదావరి జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 5 లక్షల 55 వేల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. స్వర్ణ, పీఎల్ రకాలను వేశారు. ఇప్పటివరకు రెండు లక్షల 45 వేల ఎకరాలలో పంట మాసూళ్లు పూర్తికాగా మిగిలిన పంట వివిధ దశల్లో ఉంది. ఉండ్రాజవరం పరిసర ప్రాంతాలలో రైతులు ధాన్యం వసూలుచేసి రాశులు పోశారు. నివర్ ప్రభావంతో రాశులు తడిసిపోయి నష్టం వాటిల్లింది. రాసుల కింద నీరు చేరడంతో ధాన్యం మొలకలెత్తింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లోనే నాలుగు సార్లు అధిక వర్షాలు కురిసిన పీఎల్ పండించే రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతూ వచ్చారు. కానీ నివర్ తుపాన్ ప్రభావంతో పీఎల్ రకం పంట నేల వాలడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి 30 వేల రూపాయలు పైగా పెట్టుబడి పెట్టామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నివర్ తుఫాన్ ప్రభావం వరి పంట నష్టం ఆర్థికభారం తప్పటం లేదని ఆవేదన
వర్షాలతో ఖాళీ పంటపొలాలు బురదమయంగా మారాయి. దీంతో మిషన్పై పంట మాసూలు చేయడానికి రెండు గంటల పైగా సమయం కావటం రైతులకు ఆర్థికంగా భారం అవుతుంది. ఎకరానికి సుమారుగా ఐదు నుంచి ఆరు వేల రూపాయల వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. మొలకలు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసే వారు లేక తక్కువ ధరకు కోళ్ల ఫారాల కు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందని వాపోతున్నారు