ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

PDS Rice: పశ్చిమ గోదావరి జిల్లాలో.. 11 టన్నుల రేషన్‌ బియ్యం స్వాధీనం - ration rice

పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మం. చోడవరంలో 11 టన్నుల రేషన్‌ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారనే సమాచారంతో.. తనిఖీలు చేపట్టారు. ఎవరైన బియ్యం నిల్వ చేసినట్లు తెలిస్తే కఠినచర్యలుంటాయని అధికారులు హెచ్చరించారు.

PDS Rice
PDS Rice

By

Published : Aug 29, 2021, 10:59 AM IST

కరోనా వేళ.. తెల్లరేషన్‌ కార్డుదారులందరికీ నెలవారీ కోటా రెట్టింపైంది. సాధారణంగా రేషన్ బియ్యాన్ని అన్నంగా వండుకునేవారు చాలా తక్కువ. దోశల పిండికి వినియోగిస్తారు. ఇప్పుడు అదనపు కోటా వస్తుండటంతో... చాలాచోట్ల రేషన్ దుకాణదారులే కార్డుదారుల వద్ద దొడ్డు బియ్యాన్ని కొనేస్తున్నారు. పాలిష్ చేయించి సన్నబియ్యంగా మార్చి పక్క రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. ఏడాదిగా రాష్ట్ర సరిహద్దుల్లో అధికారులు పెద్దఎత్తున బియ్యాన్ని పట్టుకోవడమే ఇందుకు నిదర్శనం.

తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మం. చోడవరంలో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారనే సమాచారంతో.. పౌరసరఫరాల శాఖ తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో 11 టన్నుల రేషన్‌ బియ్యం స్వాధీనం చేసకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎవరైన బియ్యం నిల్వ చేసినట్లు తెలిస్తే కఠినచర్యలుంటాయని అధికారులు హెచ్చరించారు. పేదలకు దక్కాల్సిన బియ్యాన్ని పక్కదోవ పట్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details