ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 8, 2021, 9:31 AM IST

ETV Bharat / state

పెదవేగిలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక స్వాధీనం

పశ్చిమగోదావరిజిల్లా పెదవేగి మండలం చినకడిమి వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను.. ఎస్​ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారీస్థాయిలో ఇసుక అక్రమ రవాణ జరుగుతోందని.. స్థానికులు ఫిర్యాదు ఇవ్వటంతో తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

sand
పెదవేగిలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక స్వాధీనం

పశ్చిమగోదావరిజిల్లా పెదవేగి మండలం చినకడిమి వద్ద అక్రమంగా తరలిస్తున్న ఇసుక వాహనాలను.. స్పెషల్ ఎన్​ఫోర్సుమెంట్​ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమ్మిలేరు నుంచి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా రహదారిపైకి తరలించి.. అక్కడి నుంచి జేసీబీ, టిప్పర్ల సాయంతో రవాణా చేయడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో ఎస్​ఈబీ అధికారులు ఆ వాహనాలను పట్టుకున్నారు. భారీస్థాయిలో ఇసుక అక్రమ రవాణ సాగుతోందని.. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details