పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందని కొవ్వూరు పోలీసులకు సమాచారం అందటంతో వారు తనీఖీలు చేపట్టారు. ఎటువంటి అనుమతులు లేని 11లారీల్లో ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించామని కొవ్వూరు సీ.ఐ. సురేష్ తెలిపారు. 11 లారీలు, ఇరవై రెండు యూనిట్ల ఇసుకను స్వాధీనపరచుకొని... పది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలు సీజ్... - sand
పశ్చిమ గోదావరి జిల్లాలో అనధికారకంగా తరలిస్తున్న ఇసుక లారీలను పోలీసులు సీజ్ చేశారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని ఫిర్యాదు అందటంతో కొవ్వూరు మండలం సీతంపేట వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. 11 లారీలలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించామని కొవ్వూరు సీ.ఐ. సురేష్ తెలిపారు.

ఇసుక లారీలను సీజ్ చేసిన పోలీసులు