ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా మట్టి తవ్వకాలు.. అడ్డుకునేవారెవరు?! - కొమ్మరఅమ్మ చెరువులో అక్రమ మట్టి తవ్వకాల వార్తలు

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ చెరువులు అక్రమార్కులకు వరంగా మారుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా చెరువుల్లో మట్టి తవ్వి అమ్ముకుంటున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

illegal soil excauvations
అక్రమంగా మట్టి తవ్వకాలు.. అడ్డుకునేవారెవరు!

By

Published : Dec 12, 2020, 12:04 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం కొమ్మర అమ్మ చెరువులో.. నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. జేసీబీతో చెరువులో మట్టిని తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ట్రక్కు మట్టిని దూరాన్ని బట్టి రూ.300 నుంచి రూ. 350 కి అమ్ముతున్నారు. స్థానికంగా ఉన్న రాజకీయ నాయకుల అండదండలతో తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్విన కారణంగా.. చెరువు చెరువు ఆకృతి దెబ్బతిని ప్రమాదకరంగా మారుతోంది. ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రాంతంలోనే ఈ తతంగం కొనసాగుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. ఈ పని చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. స్పందించిన పంచాయతీ కార్యదర్శి సాయి చందు.. ఎవరికీ మట్టి తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదని తేల్చి చెప్పారు. కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details