ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా ఇసుక తరలింపు... 6 ట్రాక్టర్లు స్వాధీనం - illegal sand movement in IS raghavapuram east godavari

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ రాఘవాపురంలో ఏలూరు ఎస్​ఈబీ అధికారులు దాడులు చేశారు. ఎర్ర కాలువ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుకను అడ్డుకున్నారు. 6 ట్రాక్టర్లలోని ఇసుకతో సహ డ్రైవర్లను, యాజమానులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

ఐఎస్ రాఘవాపురంలో అక్రమంగా ఇసుక తరలింపు... 6 ట్రాక్టర్లు స్వాధీనం
ఐఎస్ రాఘవాపురంలో అక్రమంగా ఇసుక తరలింపు... 6 ట్రాక్టర్లు స్వాధీనం

By

Published : Nov 6, 2020, 11:54 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం ఐఎస్ రాఘవాపురంలో ఎర్ర కాలువ నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్చగా సాగుతుంది. ఎటువంటి అధికారిక బిల్లులు లేకుండా ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్నారు. ఈ విషయంపై స్థానికులు అధికారులు దృష్టికి తీసుకున్నప్పటికీ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎట్టకేలకు ఏలూరు ఎస్​ఈబీ అధికారులు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 6 ట్రాక్టర్లను పట్టుకున్నారు.

బిల్లులు చూపించమని ట్రాక్టర్ డ్రైవర్లను నిలదీయటంతో ముఖం చాటేశారు. డ్రైవర్లను, ట్రాక్టర్లను ఇసుకతో సహా అదుపులోకి తీసుకొని ద్వారకాతిరుమల పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి

సముద్రంలో పడవ బోల్తా... మత్స్యకారులు క్షేమం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details