పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని నరసాపురం రెండో పట్టణ పోలీసులు సోమవారం అర్ధరాత్రి పట్టుకున్నారు. నర్సాపురం కుండల బజార్లో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఎస్సై ముత్యాలరావు, సిబ్బందితో కలిసి బియ్యాన్ని రవాణా చేస్తున్న లారీని స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో లారీ డ్రైవర్ పరారవ్వగా.. లారీని పౌర సరఫరాల శాఖ గోడౌన్‌కు తరలించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ కె.బాజీ సత్యనారాయణ ఆధ్వర్యంలో బియ్యం బస్తాలను లెక్కించగా 274 క్వింటాల 27 కిలోలగా నిర్ధారణ అయిందన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 274 క్వింటాల బియ్యాన్ని తరలిస్తున్న లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత