పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు జాతీయ రహదారిపై అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో దాడులు నిర్వహించిన అధికారులు 20 టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. లారీతో పాటు బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుపడ్డ బియ్యం విలువ రూ.6.40 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఘటనకు సంబంధించి ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ ఎస్సై కె.ఏసుబాబు తెలిపారు. గుంటూరు నుంచి తూర్పుగోదావరి జిల్లా మండపేటకు బియ్యం తరలిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. సోమవారం ఇదే ప్రాంతంలో 21.5 టన్నుల బియ్యాన్ని పట్టుకున్న అధికారులు మంగళవారం మరో 20 టన్నుల బియ్యాన్ని పట్టుకోవడం విశేషం.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత... ముగ్గురిపై కేసు నమోదు
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం, లారీని పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరులో విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ రూ.6.40 లక్షలు ఉన్నట్లు అంచనా వేసిన అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అక్రమ రేషన్ బియ్యం పట్టివేత