తెలంగాణ రాష్ట్రం నుంచి పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురానికి.. అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఒకరిని అరెస్టు చేసిన పోలీసులు మరొకరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల నుంచి 50 మద్యం సీసాలతో పాటు రెండు ద్విచక్రవాహనాలు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని జంగారెడ్డిగూడెం ఎస్ఐ గంగాధర్ తెలిపారు.
గోపాలపురంలో తెలంగాణ మద్యం పట్టివేత - పశ్చిమగోదావరి జిల్లా నేటి వార్తలు
మద్యం కట్టడికి ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా అక్రమార్కులు కొత్త మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నారు. భారీగా ధరలు పెంచినా సరిహద్దు రాష్ట్రాల నుంచి మద్యాన్ని తరలిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురంలో తెలంగాణ నుంచి తరలిస్తున్న 50 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గోపాలపురంలో తెలంగాణ మద్యం పట్టివేత