పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని వాసవీమాత ఆలయ సమీపంవద్ద కామాక్షి కమర్షియల్ కాంప్లెక్స్ లోని అక్రమ కట్టడాలను పురపాలక అధికారులు నేలమట్టం చేశారు. అనుమతులు లేకుండా కాంప్లెక్స్ పార్కింగ్ స్థలం వద్ద నిర్మించిన భవనాలను జేసీబీ సహాయంతో ధ్వంసం చేశారు. ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా ఉండేందుకు 150 మంది భారీగా పోలీసులను మోహరించారు.
గూడెంలో అక్రమ కట్టడాల కూల్చివేత - తాడేపల్లిగూడెం
అక్రమ కట్టడాలపై తాడేపల్లిగూడెం పురపాలక అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. 150 మంది పోలీసుల బందోబస్తు మధ్య... జేసీబీ సహాయంతో అనుమతుల్లేని కట్టడాలను నేలమట్టం చేశారు.
అక్రమ కట్టడాలు కూల్చివేత..