ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అక్రమ కేసులు పెట్టినా.. నామినేషన్​కు భయపడలేదు' - ఏలూరు మండలం

జిల్లాలో జరిగే నాలుగో విడత పంచాయతీ ఎన్నికలకు ఏలూరు మండలం శ్రీపర్రు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థినిగా సైదు తిరుపతమ్మ నామినేషన్ వేశారు. తమపై పలు అక్రమ కేసులు పెట్టినా.. భయపడకుండా నామినేషన్ వేశామని అభ్యర్థిని భర్త పేర్కొన్నారు.

illegal-cases-were-filed-but-we-are-not-afraid-of-nomination-says-husband-of-sarpanch-candidate
'అక్రమ కేసులు పెట్టినా.. నామినేషన్​కు భయపడలేదు'

By

Published : Feb 13, 2021, 10:58 PM IST

ఓ అభ్యర్థిని ఏకగ్రీవం చేసేందుకు.. తమను నామినేషన్ వేయకుండా అనేక ప్రయత్నాలు చేశారని సర్పంచ్ అభ్యర్థిని భర్త ఆరోపించారు. ఈ ఘటన.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలంలో చోటు చేసుకుంది.

జిల్లాలో జరిగే నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో శ్రీపర్రు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థినిగా సైదు తిరుపతమ్మ నామినేషన్ వేశారు. ఓ అభ్యర్థిని ఏకగ్రీవం చేసేందుకు.. తమను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని అభ్యర్థిని భర్త గోవర్ధన్ ఆరోపించారు. తమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం, అత్యాచారం వంటి పలు అక్రమ కేసులు పెట్టినా.. భయపడకుండా నామినేషన్ వేశామన్నారు.

ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీలో.. ప్రజాప్రతినిధులు అర్హులకు కాకుండా ఇళ్లున్న వారికే కేటాయిస్తున్నారని గోవర్ధన్​ ఆరోపించారు. ఎన్నికల అనంతరం అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడతానని తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

పల్లెపోరు: రెండో దశలో పోలింగ్ శాతం ఎంతంటే..?

ABOUT THE AUTHOR

...view details