విశాఖపట్నం ఏజెన్సీ నుంచి తమిళనాడుకు రైళ్లలో గంజాయిని రవాణా చేస్తున్న ముఠాను పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. చిన్న చిన్న మూటలుగా కట్టి ఆరుగురు సభ్యులతో కూడిన ముఠా గంజాయిని తరలిస్తుండగా నిడదవోలు పోలీసులు తనిఖీ నిర్వహించారు. వారి నుంచి 130 కిలోల సరుకు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వారిలో ఆళ్ల శ్రీనివాసరావు, పోతు శీను, శివ, ఉప్పులయ్య, ఇళ్ల శ్రీను, దుర్గాప్రసాద్ అనే వ్యక్తులు ఉన్నారు. వీరంతా విశాఖపట్నం, తర్పూ గోదావరి జిల్లాలకు చెందినవారు. ఈ వ్యవహారానికి సంబంధించి.. రాజమండ్రి వాసి జెర్రిపోతుల రమణమ్మది కీలక పాత్ర అని డీఎస్పీ రాజేశ్వరరెడ్డి తెలిపారు. రమణమ్మతో పాటు మరో ఇద్దరు పరారీలో ఉన్నారని వెల్లడించారు.
నిఘా పెట్టారు.. 130 కేజీల గంజాయిని పట్టారు - గంజాయి
విశాఖ నుంచి రైలులో గంజాయిని రవాణా చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను నిడదవోలు పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో నూట ముఫ్పై కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అక్రమ రవాణా చేస్తున్న వారిపై కేసు నమోదు చేశారు.
నిఘా పెట్టారు..130 కేజీల గంజాయిని పట్టారు