ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్య ఇంటి ముందు భర్త క్షుద్రపూజలు..!

భార్య ఇంటి ముందు భర్త క్షుద్ర పూజలు చేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెంలో జరిగింది. ఈ మేరకు భార్య రాజకుమారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెవెన్యూ, పోలీసులు అధికారులు గ్రామంలో విచారణ చేపట్టారు.

husband-worships-in-front-of-wifes-house-in-west-godavarai-district
husband-worships-in-front-of-wifes-house-in-west-godavarai-district

By

Published : Nov 27, 2019, 11:00 PM IST

భార్య ఇంటి ముందు భర్త క్షుద్ర పూజలు...బాధితురాలు ఫిర్యాదు..!

పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం రవ్వవారిగూడెంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. రవ్వవారిగూడెంకు చెందిన పల్లపు రాజకుమారి భర్తతో విడిపోయి ఉంటుంది. కొద్ది రోజులుగా విడాకులు ఇవ్వాలని భార్యను భర్త వేధింపులకు గురి చేస్తున్నాడు. మరోవైపు కొద్ది రోజులుగా రాజకుమారి ఇంటి ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, బొమ్మలు పెట్టి వెళ్తున్నాడు.

ఇవాళ కూడా అదే విధంగా వస్తువులు పెడుతుండగా... భార్య రాజకుమారి చూసి కేకలు వేసింది. అప్రమత్తమైన భర్త.. వెంటనే అక్కడ్నుంచీ పరారయ్యాడు. బాధితురాలు పోలీసులను, రెవెన్యూ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఘటనపై తహశీల్దార్, ఎస్సై గ్రామంలో విచారణ చేపట్టారు. మూఢ నమ్మకాలను నమ్మొద్దని గ్రామస్థులకు అవగాహన కల్పించారు.

ఇదీ చదవండి : ఘనంగా వీరుల తిరునాళ్ల పల్నాడు ఉత్సవాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details