మద్యానికి డబ్బులివ్వలేదని కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ ప్రబుద్ధుడు. ఈ దారుణం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం ప్రగడపల్లిలో జరిగింది. నిడదవోలు మండలం ఉండ్రాజవరానికి చెందిన సురేష్, ప్రగడపల్లి గ్రామానికి చెందిన నాగ దుర్గాదేవికి 11 సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యింది. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నాయి. ఈ క్రమంలో నాగ దుర్గాదేవి పుట్టింటికి వచ్చేయటంతో, పెద్దలు రాజీ కుదర్చటంతో ప్రగడపల్లిలో కాపురం పెట్టారు.
మద్యానికి డబ్బులివ్వలేదని... కడతేర్చాడు! - ప్రగడపల్లిలో భార్యను చంపిన భర్త
11 సంవత్సరాల క్రితం వారిద్దరికీ పెళ్లయ్యింది. వీరి మధ్యలో మద్యం భూతం చిచ్చు పెట్టింది. కట్టుకున్న భార్య కంటే మద్యం మత్తే ఎక్కువనిపించింది. మద్యం తాగేందుకు డబ్బులివ్వలేదని తాళికట్టిన భార్య మెడకు సెల్ ఛార్జర్ వైర్‌ను బిగించి హత్య చేశాడు.
![మద్యానికి డబ్బులివ్వలేదని... కడతేర్చాడు! husband kills wife with cellphone charger in pragadapalli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7428372-430-7428372-1590996644098.jpg)
భార్యను చంపిన భర్త
మద్యం తాగేందుకు డబ్బులిమ్మని సురేష్ గొడవపడ్డాడు. భార్యను ఎంత అడిగినా డబ్బు ఇవ్వటం లేదనే కోపంతో సెల్‌ఛార్జర్ వైరును నాగ దుర్గాదేవి మెడకు బిగించి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి:ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నిధుల విడుదల