ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పింఛను డబ్బు ఇవ్వలేదని.. భార్యను నరికి చంపిన భర్త! - seetharamapuram south wife murder

కడ వరకు తోడుండాల్సిన భర్తే.. భార్యను కడతేర్చాడు. దివ్యాంగ పింఛను నగదు ఇవ్వలేదనే అక్కసుతో భార్యను కూతురి ముందే నరికి చంపాడా భర్త. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా సీతారాంపురం సౌత్​లో జరిగింది.

husband kills wife for pension money
భార్యను చంపిన భర్త

By

Published : Sep 2, 2020, 8:55 AM IST

అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్న భర్తే.. ఆమె పాలిట యముడయ్యాడు. వ్యసనాలకు బానిసై... భార్యకు వచ్చిన దివ్యాంగ పింఛను ఇవ్వాలని ఒత్తిడి తెచ్చాడు. ఆమె నగదు ఇవ్వటానికి నిరాకరించటంతో.. కుమార్తె ముందే కత్తితో నరికి చంపాడు. ఈ దారుణ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారామపురం సౌత్​లో జరిగింది.

సీతారామపురం సౌత్​కు చెందిన కంబాల విజయలక్ష్మి దివ్యాంగురాలు. ఆమెకు రుస్తాంబాదకు చెందిన గన్నాగత్తుల వీరవెంకట దుర్గారావు( దొరబాబు)తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు శ్రావ్య, హర్షవర్ధన్ ఉన్నారు. వ్యసనాలకు బానిసైన దొరబాబు..విజయలక్ష్మిని నగదు కోసం వేధించేవాడు. దీంతో విజయలక్ష్మి సంవత్సరం క్రితమే పుట్టింటికి వచ్చేశారు. అక్కడకు వచ్చిన దొరబాబు విజయలక్ష్మి వచ్చిన దివ్యాంగ పింఛను ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. డ్వాక్రా సంఘంలో వచ్చిన రుణ నగదును సైతం దొరబాబు తీసుకోవడంతో.. పింఛను నగదు ఇచ్చేందుకు విజయలక్ష్మి నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన దొరబాబు, కుమార్తె పక్కనే ఉందనే విజ్ఞత లేకుండా.. విజయలక్ష్మిని కత్తితో నరికి చంపాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:మొరాయించిన సర్వర్లు-పింఛన్ల పంపిణీలో కష్టాలు

ABOUT THE AUTHOR

...view details