పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లులో దారుణం జరిగింది. అత్యంత కిరాతకంగా భార్యను నరికి చంపాడు భర్త. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మోగల్లుకు చెందిన కొరకూటి సత్యవతి(65), నాగేశ్వరరావు (70) భార్యాభర్తలు. కొంతకాలంగా నాగేశ్వరరావుకు మతి స్థిమితం లేదు.
ఈ క్రమంలో భార్య రొయ్యల ఫ్యాక్టరీ కి వెళ్లి కుటుంబాన్ని పోషిస్తోంది. రాత్రి సమయంలో ఒంటరిగా ఉన్న ఆమెపై కత్తితో దాడి చేసిన నాగేశ్వరరావు... నరికి చంపాడు. కేకలు విన్న స్థానికులు వేరేచోట ఉంటున్న ఆ దంపతుల కుమారుడికి సమాచారం అందించారు. కుమారుడు, బంధువులు వచ్చి తలుపులు పగలగొట్టి చూసేసరికి దారుణం జరిగిపోయింది.