ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దారుణం: భార్యను కత్తితో నరికి చంపిన భర్త - పశ్చిమగోదావరి జిల్లా వార్తలు

భార్యపై అనుమానంతో కత్తితో నరికి చంపాడు ఓ భర్త. ఈ దారుణమైన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా కాపవరం గ్రామంలో చోటుచేసుకుంది.

husband-brutally-murder-in-wife-at-kapavaram
భార్యను చంపిన భర్త

By

Published : Jan 14, 2021, 12:58 PM IST

పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం కాపవరం గ్రామంలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో భర్త కత్తితో నరికి చంపాడు. కాపవరం గ్రామానికి చెందిన జక్కంశెట్టి దానమ్మ, ఆమె భర్త శ్రీనివాసులు మధ్య కొంత కాలంగా మనస్పర్ధలు నడుస్తున్నాయి. ఈ కారణం చేత వాళ్లు వేర్వేరుగా ఉండేవారు. వారు పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకుని కొద్ది రోజులుగా కలిసి ఉంటున్నారు. వీరికి నలుగురు సంతానం. ఇద్దరు ఆడ పిల్లలు, ఇద్దరు మగపిల్లలు. ఇద్దరు ఆడపిల్లలకు వివాహాలు అయ్యాయి. ఇద్దరు మగ పిల్లలు ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లారు.

గతంలో దానమ్మ ప్రవర్తన మీద అనుమానంతో భార్యాభర్తలు ఇద్దరూ గొడవ పడ్డారు. ఏడాది కిందట వరకు వేర్వేరుగా ఉన్న ఇద్దరు కొద్ది రోజుల కిందటే కలిశారు. కలిసిన తర్వాత కూడా భర్త శ్రీనివాస్ భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. తెల్లవారుజామున ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో కత్తితో నరకడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. తణుకు సీఐ చైతన్య కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details