ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అడవి జంతువులను వేటాడుతున్న ఇంటి దొంగ

అటవీ శాఖలో పనిచేసే వ్యక్తే అక్రమాలకు పాల్పడ్డాడు. వేటగాళ్లతో జతకట్టి జంతువుల వేటకు సహకరించాడు. విక్రయాలు సైతం మొదలు పెట్టాడు. సమాచారం తెలుసుకున్న అధికారులు అతని ఇంటిపై సోదాలు జరిపారు. 2 జింక కొమ్ములు స్వాధీనం చేసుకున్నారు.

Hunting wild animals
Hunting wild animals

By

Published : May 13, 2020, 5:12 PM IST

పశ్చిమగోదావరి జిల్లా సరసాపురం మండలంలో జింక కొమ్ములు ఉన్నాయనే సమాచారంతో అటవీ శాఖ అధికారులు దాడులు చేశారు. రవీంద్ర అనే వ్యక్తి కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో వాచర్ గా పనిచేస్తున్నాడు. అడవిలో వేటగాళ్లతో జతకట్టి వన్య ప్రాణులను వేటాడేందుకు సహకరిస్తున్నాడు.

వేసవిలో నీరు తాగేందుకు వచ్చిన జింకలు, దుప్పిలు, అడవి పందులను చంపి వాటిని విక్రయిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న అధికారులు... రవీంద్ర ఇంటి వద్ద సోదాలు నిర్వహించారు. 2 జింక కొమ్ములు, 2 టన్నుల జామాయిల్ కర్రలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details