పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని అంబికా సిల్వర్ ప్యాలెస్ యజమాని అశోక్ కుమార్ జైన్ విజయవాడలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో తన వ్యాపార బాధ్యతలను తన వద్ద గుమస్తాగా పనిచేస్తున్న చాట్ల శివప్రసాద్కు అప్పగించాడు. ఏడాది కాలంగా శివప్రసాద్ సుమారు 358 కిలోల వెండి ఆభరణాలను విక్రయించినట్లు తప్పుడు లెక్కలు చూపి వాటిని అపహరించినట్లు అశోక్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అపహరణకు గురైన ఆభరణాల విలువ రూ.2.50 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
తప్పుడు లెక్కలతో రూ.కోట్లు విలువైన ఆభరణాలు అపహరణ! - theft in west godavari district crime
తప్పుడు లెక్కలు చూపించి రూ.2.50కోట్లు విలువైన ఆభరణాలను అహరించారంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జరిగింది.
నరసాపురంలో దొంగతనం