పశ్చిమ గోదావరి జిల్లాలో నిరుపేదలకు టిడ్కో గృహలు అందించాలని "నా ఇల్లు నా సొంతం" పేరుతో తెదేపా శ్రేణులు భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించాయి. టిడ్కో గృహాలు ఉన్న నరసాపురం, పాలకొల్లు, ఏలూరు, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో తెదేపా శ్రేణులు ఆందోళన చేపట్టాయి.
గృహాల వరకు పాదయాత్ర..
కార్యక్రమంలో భాగంగా టిడ్కో గృహాల వరకు పాదయాత్ర నిర్వహించారు. ఏలూరులో తెదేపా నియోజకవర్గ బాధ్యులు బడేటి రాధాకృష్ణ.. లబ్ధిదారులతో కలసి టిడ్కో గృహాలను పరిశీలించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మాణం పూర్తి చేసిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందించే వరకు ఉద్యమం చేపడతామని రాధాకృష్ణ చెప్పారు.
ఇవీ చూడండి:
ప్రైవేటు సంస్థల చేతికి ఇసుక రీచ్లు.. అక్రమాలకు అడ్డుకట్ట పడేనా?