పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల, నరసాపురంలో కూరగాయల దుకాణాల్లో అమ్మకాలు నియమిత సమయాల్లో జోరుగా కొనసాగుతున్నాయి. ఆయా మాంసం దుకాణాల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించడంలేదు. ఆదివారం సంత నేపథ్యంలో అమ్మకాలకు అధికారులు అనుమతించారు. దుకాణాల వద్ద క్యూ పద్ధతిలో దూరాన్ని పాటించేలా నిర్వాహకులు బాధ్యత వహించాలని ఆదేశించారు. కొనుగోలు దారులు అవేవీ పట్టించుకోకుండా ఆయా దుకాణాల వద్ద గుమిగూడారు. నరసాపురం చేపల మార్కెట్లో ప్రజలు సామాజిక దూరం పాటించకపోవడం.. విమర్శలకు తావిచ్చింది.
సామాజిక దూరం పాటించని ప్రజలు... దుకాణాల వద్ద బారులు - తూర్పుగోదావరి మార్కెట్లో ప్రజల తాకిడి
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి సామాజిక దూరాన్ని పాటించాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా... ప్రజలు పెడచెవిన పెడుతున్నారు. మాంసం, కూరగాయల దుకాణాల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించకుండా గుమిగూడారు.
మార్కెట్లకు ప్రజల తాకిడి