తెలంగాణ మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని.. ఎస్ఈబీ అధికారులు అరెస్ట్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లిలో అతడి నుంచి 122 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.
తుంపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తి తెలంగాణ నుంచి మద్యం తీసుకువచ్చి స్థానికంగా విక్రయిస్తున్నాడు. ఎస్ఈబీ ఏలూరు సీఐ ధనరాజ్కు సమాచారం అందగా.. సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. అతని ఇంటి వద్ద నుంచి 90 క్వార్టర్, 20 నిప్స్ బాటిళ్లతో పాటు 12 బీరు సీసాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు.