పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి హుండీ ద్వారా రూ.1.42 కోట్లు ఆదాయం సమకూరినట్లు ఈవో జీవీ సుబ్బారెడ్డి తెలిపారు. గడచిన 20 రోజుల హుండీ ఆదాయాన్ని అధికారులు ఇవాళ లెక్కించారు. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో.. భారీ భద్రతా ఏర్పాట్ల నడుమ ఈవో ఆధ్వర్యంలో దేవాలయ సిబ్బంది లెక్కింపు నిర్వహించారు.
ఇదీ చదవండి:భళా బంధకళ.. అబ్బురపరుస్తున్న చేనేత చీరలు