ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

SHOCK: కాకా హోటల్​... రూ.21 కోట్ల కరెంట్​ బిల్లు.. - huge current bill for small hotel in west godavari district

రోడ్డు పక్కన చిన్న టిఫిన్ సెంటర్. ప్రతి నెలా రూ.600 నుంచి రూ.700 వరకు కరెంట్ బిల్లు వస్తుంది. కానీ ఈ నెలలో మాత్రం అక్షరాలా రూ.21కోట్లకు పైగా బిల్లు వచ్చింది. బిల్లును చూసిన హోటల్ నిర్వాహకులు ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు. విషయాన్ని విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

కాకా హోటల్​కు... రూ.21కోట్లకు పైగా విద్యుత్ బిల్లు.. !
కాకా హోటల్​కు... రూ.21కోట్లకు పైగా విద్యుత్ బిల్లు.. ! కాకా హోటల్​కు... రూ.21కోట్లకు పైగా విద్యుత్ బిల్లు.. !

By

Published : Sep 8, 2021, 9:00 PM IST

Updated : Sep 8, 2021, 10:56 PM IST

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ అల్పాహారశాలకు ఈ నెలలో.. 21కోట్ల 48లక్షల 62వేల 224 రూపాయల విద్యుత్ బిల్లు వచ్చింది. ఈ బిల్లు చూసి ఘటనతో హోటల్ నిర్వాహకులు బెంబేలెత్తిపోయారు. ఇంత హోటల్​కు అంతా బిల్లా అంటూ అవాక్కయ్యారు. గత నెలలోనూ ఇదేవిధంగా రూ.47,148 విద్యుత్ బిల్లు వచ్చిందని వాపోయారు. ఏం చేయాలో దిక్కుతోచక విద్యుత్ శాఖ ఆఫీసుకు పరుగులు తీశారు. విషయాన్ని అధికారులకు తెలియజేశారు. బాధితుల ఫిర్యాదుతో కరెంట్ మీటర్​లో సాంకేతికలోపాన్ని గుర్తించిన అధికారులు.. కొత్త మీటర్​ అమర్చారు.

అయినప్పటికీ..

మళ్లీ భారీగా బిల్లు రావడంతో బాధితులు ఆందోళనకు గురయ్యారు. ప్రతి నెలా రూ.600 నుంచి రూ.700 మధ్య బిల్లు వస్తుందని, ఇలా ఎక్కువ మెత్తంలో రావడంతో తాము తీవ్ర భయాందోళనకు గురయ్యామని బాధితులు తెలిపారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. చింతలపూడి మండలం విద్యుత్​శాఖ ఏఈ శంకర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లగా.. సాంకేతికలోపం కారణంగా అంత బిల్లు వచ్చిందని..దానిని సరిచేశామని తెలిపారు.

ఇదీచదవండి.

VIDEO VIRAL: ప్రభుత్వ కార్యాలయాన్ని బార్​గా మార్చేశాడు..అడ్డంగా బుక్కయ్యాడు..

Last Updated : Sep 8, 2021, 10:56 PM IST

ABOUT THE AUTHOR

...view details