పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం తూర్పూపాలెంలో గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు వచ్చే ఏప్రిల్ నుంచి రేషన్ డిపోల ద్వారా సన్నబియ్యం అందిస్తామని ప్రకటించారు. పేదలకు సన్నబియ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. అందుకు అనుగుణంగానే ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. విజయనగరం జిల్లాలో నాసిరకం సన్నబియ్యం విషయంపై స్పందిస్తూ బియ్యం వర్షానికి తడవటం వలనే అలా జరిగిందని వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో దశలవారీగా 25 లక్షల ఇంటి నిర్మాణాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. గోదావరి వరదల కారణంగా నష్టపోయిన అందర్ని ఆదుకుంటామి ఆయన హామీ ఇచ్చారు.
ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ - తూర్పూపాలెం
వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచే రేషన్ డిపోల ద్వారా సన్నబియ్యం అందిస్తామని గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు వెల్లడించారు.
ఏప్రిల్ నుంచే సన్నబియ్యం రేషన్ బియ్యం పంపిణీ