ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తణుకులో సీపీఐ నాయకుల గృహ నిర్బంధం - తణుకులో సీపీఐ పార్టీ నాయకులను హౌస్ అరెస్ట్ వార్తలు

పోలవరం పరిరక్షణ యాత్రను అడ్డుకునే ప్రయత్నంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సీపీఐ నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఏఐటీయుసీ జిల్లా అధ్యక్షులు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కోనాల భీమారావును హౌస్ అరెస్ట్ చేశారు.

House arrest of CPI party leaders in Tanuku westgodavari district
తణుకులో సీపీఐ పార్టీ నాయకుల గృహ నిర్బంధం

By

Published : Nov 22, 2020, 1:46 PM IST

పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన నిమిత్తం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ 'చలో' పోలవరం పిలుపునిచ్చారు. కొవ్వూరు, రాజమహేంద్రవరం నుంచి పార్టీ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో.. పోలవరం యాత్రను అడ్డుకోవటానికి పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో భీమారావును గృహ నిర్బంధం చేశారు. వారి తీరును పార్టీ నేతలు తప్పుబట్టారు. ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ దిశగా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:

ఇళ్ల విషయంలో ప్రభుత్వ తీరు సరికాదు: అనగాని

ABOUT THE AUTHOR

...view details