ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అందుకే దిశ చట్టాన్ని తీసుకొచ్చాం: హోంమంత్రి - tanuku home minister press meet

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళకు రక్షణ కల్పించే ఉద్దేశంతోనే దిశ చట్టం రూపకల్పన చేసినట్లు హోంమంత్రి సుచరిత తెలిపారు. ఈ చట్టం అమలకు హోం శాఖను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

home minister press meet in tanuku
'దిశ చట్టంతో ప్రతీ మహిళకు రక్షణ'

By

Published : Dec 15, 2019, 7:35 AM IST

'దిశ చట్టంతో ప్రతీ మహిళకు రక్షణ'
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించేందుకే దిశ చట్టాన్ని రూపొందించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని హోమంత్రి సుచరిత తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో శనివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తర్వాత చట్టం అమల్లోకి వస్తుందని వెల్లడించారు. దిశా చట్టాన్ని అమలు చేయటానికి హోంశాఖను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. నిందితులపై వెంటనే చర్యలు తీసుకునే వీలుగా జిల్లాకు ఒక ఫాస్ట్ ట్రాస్ కోర్టును ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. దీనికి అవసరమైన సిబ్బంది నియామకం, సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details