ఘనంగా హోంమంత్రి సుచరిత కుమార్తె వివాహం - హోంమంత్రి సుచరిత కుమార్తె వివాహం
హోంమంత్రి సుచరిత కుమార్తె రిషిక వివాహం ఘనంగా జరిగింది. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకలో.. మంత్రులు బుగ్గన, మోపిదేవి, చెరుకువాడ పాల్గొన్నారు.
రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత కుమార్తె రిషిక వివాహం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని బెల్ వెదర్ పాఠశాల ఆవరణలో వైభవంగా జరిగింది. బెల్ వెదర్ పాఠశాల అధినేత అద్దంకి విజయకుమార్ కుమారుడు దీపక్‌ను రిషిక వివాహం చేసుకుంది. క్రైస్తవ సంప్రదాయ పద్ధతిలో మత పెద్దల ఆశీర్వచనాలు, ప్రార్థనల మధ్య వేడుకను ఘనంగా నిర్వహించారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, మోపిదేవి వెంకటరమణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, భాజపా నేత పైడికొండల మాణిక్యాలరావు, స్థానిక ఎమ్మెల్యేలతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.