HIGH COURT పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో టిడ్కో ఇళ్ల పంపిణీ వేళ.. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిపై దాడి, ప్రొటోకాల్ ఉల్లంఘన వ్యవహారంలో వివరణ ఇవ్వాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీ, నర్సాపురం డీఎస్పీ, పాలకొల్లు ఠాణా ఎస్‌హెచ్‌వోకు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని పేర్కొంటూ విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.
ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిపై దాడి, పూర్తి వివరణ ఇవ్వాలని అధికారులకు హైకోర్టు ఆదేశాలు
HIGH COURT ON MLA NIMMALA పాలకొల్లులో టిడ్కో ఇళ్ల పంపిణీ వేళ తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిపై దాడి, ప్రొటోకాల్ ఉల్లంఘన వ్యవహారంలో వివరణ ఇవ్వాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని పేర్కొంటూ విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.
ఈనెల 5న పాలకొల్లులో టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు పంపిణీ చేసే కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించలేదని, స్థానిక ఎమ్మెల్యే అయిన తనపై వైకాపా శ్రేణులు దాడి చేశాయంటూ తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి ఆహ్వానించి.. వేదికపైకి వెళ్లకుండా వైకాపా నాయకులు అడ్డుకొని దాడి చేశారని రామానాయుడు తరపు న్యాయవాది వాదించారు. స్వల్ప గాయాలయ్యాయని.. ఇదంతా పోలీసుల సమక్షంలో జరిగినా.. వారు మౌనంగా ఉన్నారన్నారు . శిలాఫలకం చివర్లో పిటిషనర్ పేరును ప్రచురించి ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారన్నారు . చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా అధికారులు ఆదేశించాలని కోరారు.
ఇవీ చదవండి: