వ్యాపారులు లాక్డౌన్ పేరుతో ధరలు అమాంతం పెంచేసి సామాన్య ప్రజలను దోచుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, కొవ్వూరు, గోపాలపురం, చింతలపూడి తదితర ప్రాంతాల్లో పప్పులు, వంట నూనెలు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ధర పట్టికలో ఒక రేటు ఉండగా.. వినియోగదారుడికి మాత్రం అధిక ధరలకే అమ్ముతున్నారని సామాన్యులు వాపోతున్నారు. కూరగాయల ధరలు అందుబాటులోనే ఉన్నా, వంట నూనెలు, పప్పులు, పండ్ల ధరలు మాత్రం పెంచేశారు. లారీల కిరాయి అధికంగా ఉంటుందనీ, అందువల్లే ధరలు పెంచినట్లు వ్యాపారులు తెలిపారు. నిత్యావసర వస్తువులకు సడలింపు ఉన్నా, వ్యాపారులు మాత్రం ప్రజల నుంచి ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, ధరలు అదుపు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ధర ఒకటి...అమ్మేది మరో రేటుకి - జంగారెడ్డిగూడెంలో అధిక ధరలు
ధర పట్టిక చూసి పప్పులు, నూనెలు కొనాలని వెళ్తే ఇక అంతే... ఎందుకంటే పట్టికలో ఒక ధర చూపి మరొక ధరకు అమ్ముతున్నారు. కూరగాయల ధరలు అందుబాటులోనే ఉన్నా, వ్యాపారులు పప్పులు, నూనెల ధరలు పెంచేశారు.
జంగారెడ్డిగూడెంలో ధరలు పెంచేసిన వ్యాపారులు