పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు వింత వ్యాధిపై అధ్యయనం చేసిన మల్టీ డిసిప్లినరీ కమిటీ సిఫార్సుల అమలుకు... ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో వివిధ శాఖలకు చెందిన 9 మంది కార్యదర్శులకు కమిటీలో చోటు కల్పించింది. కాలుష్య నివారణ, తాగు-సాగునీటిలో కలిసే వ్యర్థాల నియంత్రణపై... వివిధ శాఖలు సిద్ధం చేసిన కార్యచరణ ప్రణాళికను ఈ కమిటీ పర్యవేక్షించనుంది. నీరు, ఆహారం, గాలి, మట్టి, వ్యవసాయం, ఆక్వా వ్యర్థాల పర్యవేక్షణకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయనుంది. ఈ హైలెవల్ కమిటీని నెలకు కనీసం ఒక్కసారైనా భేటీ కావాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఏలూరు వింత వ్యాధిపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు
ఏలూరు వింత వ్యాధిపై అధ్యయనం చేసిన మల్టీ డిసిప్లినరీ కమిటీ సిఫార్సుల అమలుకు... ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తూ ఆదేశాలిచ్చింది.వివిధ శాఖలకు చెందిన 9 మంది కార్యదర్శులకు కమిటీలో చోటు కల్పించింది. నెలకు కనీసం ఒక్కసారైనా భేటీ కావాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఏలూరు వింత వ్యాధిపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు