High court: ఆ కేసులో చింతమనేని ప్రభాకర్‌కు ఊరట - చింతమనేని ప్రభాకర్ వార్తలు

12:15 May 04
చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు
High court: తెదేపా సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో తదుపరి చర్యలు చేపట్టవద్దంటూ ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. 'బాదుడే బాదుడు' పేరిట వారం ముందు తెదేపా నిర్వహించిన కార్యక్రమంలో చింతమనేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై అందిన ఫిర్యాదుతో.. చింతలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా.. తదుపరి చర్యలపై స్టే విధించింది.
ఇదీ చదవండి:
YS Viveka Murder Case: హైకోర్టులో వైఎస్ వివేకా కేసు.. హాజరైన సునీత