ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని శుక్రవారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు కుటుంబ సమేతంగా సందర్శించారు. హైకోర్టు న్యాయమూర్తులు శేషసాయి, మానవేంద్ర నాథ్ రాయ్, విశ్రాంత న్యాయమూర్తి శ్యామ్ ప్రసాద్‌లు స్వామిని దర్శించుకున్నారు. అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛరణల నడుమ ప్రదక్షిణలు నిర్వహించి...,అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ముఖ మండపంలో స్వామివారి శేష వస్త్రాలను కప్పి, వేద ఆశీర్వచనాలు అందజేశారు.
చిన వెంకన్న సేవలో హైకోర్టు న్యాయమూర్తులు - ద్వారక తిరుమల చిన వెంకన్న న్యూస్
ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తులు శేషసాయి, మానవేంద్రనాథ్ రాయ్, విశ్రాంత న్యాయమూర్తి శ్యాం ప్రసాద్ దర్శించుకున్నారు. అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
చిన వెంకన్న సేవలో హైకోర్టు న్యాయమూర్తులు