ఇదీ చదవండి:
ఆర్టీసీ బస్సు నుంచి పొగలు.. తప్పిన ప్రమాదం - కరిచర్లగూడెం వద్ద ఆర్టీసీ బస్నుంచి పొగలు
పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం కరిచర్లగూడెం వద్ద ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా పొగలు రావటంతో ప్రయాణికులు పరుగులు తీశారు. జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రాజమహేంద్రవరానికి బయలుదేరింది. మార్గ మధ్యలో బస్సు నుంచి ఒక్కసారిగా మంటలు రావడం వల్ల డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపేశాడు. బస్లో ఏర్పాడ్డ సాంకేతిక లోపం.. వైర్లు కాలిపోయినందు వల్ల ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.
ఆర్టీసీ బస్నుంచి భారీగా పొగలు..తప్పిన ప్రమాదం