నేడు ప్రభుత్వ అనుమతులతో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఉదయం 11 గంటలకు షాపులు తీసే సమయమైతే.. కోడి కూయకముందే బారులు తీరారు. ధరలు పెరిగినా తప్పదనుకుని సర్దుకుపోయారు. అయితే పెరిగిన ధరలు ఆన్లైన్లో అప్ డేట్ కాని కారణంగా... అమ్మకాలు ఆలస్యమవుతున్నాయి. అయినా సరే ఏ సమయమైనా కానీ మందుసీసాతోనే ఇంటికి వెళ్తామని పట్టువదలని విక్రమార్కుల్లా నిరీక్షిస్తున్నారు మద్యం ప్రియులు.
పట్టువదలని విక్రమార్కులు.. ఈ మద్యం ప్రియులు! - తణుకులో మద్యం షాపులు
కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి 22వ తేదీన జనతా కర్ఫ్యూ, అనంతరం దేశమంతటా లాక్ డౌన్ విధించారు. దాంతో అన్ని దుకాణాలతోపాటు మద్యం షాపులూ మూతపడ్డాయి. దాదాపు నెలన్నర తర్వాత నేడు తెరుచుకున్న దుకాణాల ముందు జనం క్యూలు కట్టారు.
మద్యం షాపుల వద్ద మందుబాబుల బారులు