మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పశ్చిమ గోదావరి జిల్లాలోని లోతట్టు, పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. తణుకు మండలంలోని నివాసిత ప్రాంతాలు, ప్రధాన రహదారులు సైతం నీట మునిగాయి.
ఇళ్లల్లోకి నీరు వరదతో పాటు మురుగు నీరు చేరిన కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రహదారులపై రెండు అడుగుల మేర నీరు నిలిచిన కారణంగా.. వాహనచోదకుల రాకపోకలకు అంతరాయం కలిగింది.