ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తణుకులో కాలువలను తలపిస్తున్న కార్యాలయాలు - కార్యాలయాల్లోకి వర్షపు నీరు తాజా వార్తలు

పశ్చిమ గోదావరి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ప్రభుత్వ కార్యాలయాలు జలమయమయ్యాయి. మురుగు కాలువలు సరిగా పనిచేయని కారణంగా.. వర్షం నీరు కార్యాలయాల్లోకి వచ్చింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ కార్యాలయాలను జల దిగ్బంధం నుంచి కాపాడాలని కోరుతున్నారు.

heavy rains in tanuku
కాలువలను తలపిస్తున్న కార్యాలయాలు

By

Published : Jun 30, 2020, 7:19 PM IST

అడుగు తీసి అడుగు పెట్టేందుకు వీలు లేనంతగా వర్షం నీరు చుట్టుముట్టిన కారణంగా.. ఉద్యోగులు తెగ ఇబ్బంది పడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఇంతగా కురిసిన భారీ వర్షాలకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం, జిల్లా ఉప విద్యాశాఖాధికారి కార్యాలయాలు చెరువులను తలపించాయి.

ఈ రెండు కార్యాలయాలకు సంబంధించిన వరండాలో అడుగు మేర నీరు నిలిచిపోయింది. ఉద్యోగులు తమ ద్విచక్ర వాహనాలు సైతం కార్యాలయానికి దూరంగా పార్కింగ్ చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని సిబ్బందితో పాటు.. స్థానికులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details