పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుంది. అశ్వారావుపేట రోడ్డు పాత బస్టాండ్ తదితర ప్రాంతాలు రహదారిపై వర్షపు నీరు కాలువల ప్రవహిస్తుంది. పోలీస్ స్టేషన్ అటవీ శాఖ కార్యాలయం ఎస్ఈబీ స్టేషన్ కార్యాలయాలు నీటమునిగాయి.
జంగారెడ్డిగూడెంలో ముంచెత్తుతున్న వర్షం.. రోడ్లు జలమయం - Heavy rains in Jangareddygudem
పశ్చిమ గోదావరి జిల్లాలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాకపోకలు నిలిచాయి.

జంగారెడ్డిగూడెంలో ముంచెత్తుతున్న వర్షం.. రోడ్లు జలమయం
చింతలపూడి, గోపాలపురం, పోలవరం, కొవ్వూరు, కొయ్యలగూడెం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి తదితర మండలాల్లోను ఇదే పరిస్థితి. ఏజెన్సీ మండలాలలో కొండ వాగులు పొంగిపొర్లుతున్నాయి. జల్లేరు ఇసుక కాలువ కొవ్వాడ రేల కాలువలు పొంగటంతో కొన్ని ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచాయి.
ఇదీ చదవండి పశ్చిమగోదావరిలో రూ.20 లక్షల విలువైన మద్యం స్వాధీనం